An IIPM Initiative
ఆదివారం, మే 1, 2016
 

పారదర్శకతకు పాతర

జూలై 8, 2013 18:19

కేంద్ర సమాచార కమిషన్‌ పరిధిలోకి వచ్చేందుకు దేశంలోని పార్టీలన్నీ ముక్త కంఠంతో నిరాకరిస్తున్న వైనం దిగ్భ్రమ కలిగించేదే. ఎందుకంటే అప్పుడవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా రావాల్సి ఉంటుంది.

ఆలోచింపచేసిన మనిషి

ఆగష్టు 21, 2012 11:21

శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిని నేడు సంస్మరిస్తూ ఆయన షష్టిపూర్తి సందర్భంగా 1988లో ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు నాడు రాసిన వ్యాసం..

రాహుల్ భట్టాచార్యకు ప్రతిష్టాత్మక బ్రిటన్ సాహిత్య పురస్కారం

మే 30, 2012 11:06

బ్రిటన్ సాహిత్య పురస్కారం తొలిసారిగా భారతీయుడికి దక్కింది. ఢిల్లీకి చెందిన 33 సంవత్సరాల రాహుల్ భట్టాచార్య బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేసే 'ఆన్ డాట్జీ-2012' అవార్డుకు ఎన్నికయ్యారు.

వానొచ్చెనమ్మా

మే 1, 2012 16:32

చిన్నపుడు మా తాత చవుడుతో కట్టించిన ఐదు సందులిల్లు వానొస్తే కురిసేది. ఇల్లంతా తడవకుండా కింద తపాలం, తాంబాలం పెడితే వాటి మీద బొట్లు బొట్లుగా జారే పాటకు చిటుకుపొటుకుమంటూ వాన తపాళం తాళం దరువేసేది. వానొస్తే ఆనందం కానీ నిచ్చెన వేసుకుని, ఛత్రీ లేని దినాలవి.

ప్రేమా, నిజమేనా!

ఫిబ్రవరి 13, 2012 12:15

ఉద్రేకభరితమైన ఈ భయానక రోజును పీడించే లేదా పరిహసించే ప్రేమ సంబరాలకు కేటాయించాలా?

నవదీప్ సింగ్ కు 'అశోక్ చక్ర '

జనవరి 27, 2012 13:04

సైన్యంలో పనిచేసి ఐదునెలలే అయినా నలుగురు కరడుగట్టిన ఉగ్రవాదులను దేశంలోకి అడుగుపెట్టకుండా అత్యంత సాహసంతో ఎదిరించి వారిని ఒంటిచేత్తో మట్టుపెట్టడమేకాక వారి బారినుంచి తన సహచరుడి ప్రాణాలను కాపాడారు. అయితే తాను మాత్రం ముష్కరుల కాల్పులకు తీవ్రంగా గాయపడి దేశంకోసం ప్రాణాలర్పించి అమరుడయ్యాడు

కామెడీ లేని బిజీమేన్ బిజినెస్‌మేన్

జనవరి 21, 2012 17:22

మనం కాసేపు వినోదం కోసమో లేక కాలక్షేపానికో సినిమాకెళ్తాం. వెళ్లిన తర్వాత అక్కడ కూడా మనకి ప్రసంగాలు, రిపీట్‌ సీన్లతో బోరుకొట్టడం లాంటి పరిస్థితులు ఎదురైతే మన బాధ ఎవరికి చెప్పుకుంటాం!

నేలరాలిన మరో సాహితీ పుష్పం

జనవరి 19, 2012 10:29

విశాఖ సాగరతీరంలో తన సౌరభాలు వెదజల్లిన మరో సాహితీ పుష్పం నేలరాలింది. తన అభ్యుదయ రచనలతో సాహితీప్రియుల మనసు దోచుకున్న విరియాల లక్ష్మీపతి ఇకలేరు.

వ్యారవల్ల: రాలిపోయిన ఒక ధృవతార

జనవరి 16, 2012 15:01

నాలుగు దశాబ్దాలపాటు వార్తా ఫోటోగ్రఫీలో వ్యారవల్ల తన కెమెరాతో చేసిన విన్యాసాలను, అత్యద్భుత సృష్టిని ఇప్పటితరం వారు స్పూర్తిగా తీసుకుని ముందంజ వేస్తున్నారు. ఆమె తీసిన ఫోటోలు కళ్ళను కట్టిపడేస్తాయి. అవి ప్రకృతి దృశ్యాలైనా కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవైనా కావచ్చు, లేదా భారతదేశంలోని నిరుపేదలను గురించైనా కావచ్చు.... వ్యారవల్ల ఏ ఫోటో తీసినా సజీవ దృశ్యాలుగా మన ముందు నిలుస్తాయి.

ప్రముఖ సినీ దర్శకుడు మధుసూదనరావు కన్నుమూత

జనవరి 12, 2012 13:34

నాలుగు దశాబ్దాలపాటు అనేక ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను అందించిన ప్రముఖ సినీ దర్శకుడు వీరమాచనేని మధుసూధనరావు కన్నుమూశారు.

విశాఖ మన్యంలో 'బాక్సైట్ ' యుద్ధం

జనవరి 6, 2012 13:40

అభివృద్ధి పేరుమీద నిరుపేద బతుకులతో ఆటలాడుతోంది ప్రభుత్వం. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు కొన్ని వేల గ్రామవాసులను నిరాశ్రయుల్ని చేయనున్నాయి. అటు ఉద్యమాల్ని ఉక్కుపాదంతో అణచాలని చూస్తుంది ప్రభుత్వం. ఇటు తమ అస్తిత్వ పరిరక్షణకు ఎత్తిన పిడికిలి దించేదిలేదంటూ ఉద్యమిస్తున్న విశాఖ మన్యం ప్రజలు వెరసి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో యుద్ధం ముంచుకొస్తోంది.

పార్టీనుంచి శశికళను దూరం చేసిన జయలలిత

డిసెంబర్ 20, 2011 12:04

ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో జరిగిన జయలలిత, శశికళల పరిచయం చిన్న మొక్క వటవృక్షంలా పెరిగినట్లు నానాటికీ పెరిగి విడదీయలేని బంధంగా మారింది. ఆమెకు జయ ఎంత ప్రాధాన్యమిచ్చేవారంటే పార్టీ శ్రేణులందరూ జయలలితను 'అమ్మ ' అని సంభోదిస్తుండగా, శశికళను 'చిన్నమ్మ 'గా సంభోదించేవారు.

ప్రముఖ అస్సామీ రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి అస్తమయం

నవంబర్ 29, 2011 14:15

రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఉపన్యాసకురాలు, సామాజిక కార్యకర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇందిరా గోస్వామి రచనలు ఆధారంగా పలు నాటకాలు, సినిమాలు రూపొందాయి. 'అడజ్య ' అనే చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా జాహ్ను బారువా దర్శకత్వంలో 'వర్డ్స్ ఫ్రం ది మిస్ట్' అనే సినిమా రూపొందింది.

చెదరని చైతన్య మోహనం!

నవంబర్ 15, 2011 11:39

'ఇంతింతై వటుడింతయై, మరియు దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై' అన్నట్టు ఎదిగిన ఒక సకల జగన్మిత్రుడ్ని, నా చిరకాల మిత్రుడని చెప్పు కోవడం, ఆకాశమంత ఎదిగిన అతని భుజం తట్టే అవస్థ పడటంలాంటిది.

జగమంత కుటుంబం నాది

అక్టోబర్ 19, 2011 13:12

పుట్టిపెరిగిన గడ్డకు ఏదో సేవచేయాలనుకున్న నామమాత్రపు ఆలోచన అప్పటికింకా ఓ పూర్తిరూపం సంతరించుకోలేదు. ఆ ఆలోచనకంటూ ఓ రూపం సంతరించుకుంది విధిముందు ఓడిపోయాకే. ఆ ఆలోచనే సంకల్పంగా మారింది. అది మామూలు సంకల్పం కాదు వజ్ర సంకల్పం. వేర్పాటువాదుల ఉన్మాదం తన జీవితాన్ని ఒంటరి చేసి వెళ్లిపోయింది. అందుకు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారాయన. కానీ ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆయన ఎంచుకున్న ఆయుధం మాత్రం మమకారమనే 'ప్రేమ'. ఆ ప్రేమతోనే వారందర్నీ జయించారు.

సంచిక తేదీ: జూన్ 3, 2013

చిత్రాలు
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన