An IIPM Initiative
మంగళవారం, మే 3, 2016
 
 

ప్రేమా, నిజమేనా!

 

మోనోజిత్‌ లాహిరి... | ఫిబ్రవరి 13, 2012 12:15
 

సరే, శాంతించండి, మీరంతా ఆశ్చర్యానికి లోనై, నా నుంచి రొమాంటిక్‌ దురాగతాల గురించి వినాలనుకుంటున్నారు, సరే? ముందుగా ఎలాంటి అభిప్రాయానికీ రాకుండా, విశాల హృదయంతో ఇక్కడుకు రండి... తర్వాత మీకు నచ్చిన ముగింపుకు వచ్చే స్వేచ్ఛ మీకు ఉంది. అనుకోకుండా ఇది వి-దినోత్సవం సందర్భంగా కుక్క బుద్ధిలాంటి వారికోసం కాదు కానీ అధిక ప్రసంగం, స్పష్టమైన చూపుతో చౌసర్‌ తరచుగా సూచించే మూర్ఛరోగంతో మతం కోసం చనిపోయిన రోమన్‌ గురించిన ఓ అంశం/రోజు తీసుకోండి, ఇది క్రమంగా నియంత్రణలోంచి వెళ్లిపోతోంది, పూర్తిగా మూలాలను కోల్పోతోంది!

ఇక్కడ ఈ దిల్‌ తో పాగల్‌ హై రోజుకు సంబంధించి నా ఐదు అంశాల పరిశీలనను తెలియజేస్తాను! అంశం ఒకటి. చూడడానికి కళ్లు, స్పందించడానికి హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ ప్రధానంగా అనుభవించగలిగేది ప్రేమ - ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఉద్వేగం  జీవితాన్నే మార్చగలిగేది, ఆత్మను మేల్కొలిపేది, శరీరాన్ని జలదరింపజేసే, రక్తాన్ని ఎల్లప్పుడూ పరుగులు పెట్టించేది, గుండెలను మండించేది, తలను తిప్పేది, నిజమేనా? సరే, ఒకవేళ ఇది నిజంగా అంత పెద్ద విషయం, వేడైనది, సాధారణంగా సంభవించేదే అయితే (ఖచ్చితంగా ఎంతో ఉద్వేగభరితమైన న్యాయవాదులు, వికలాంగులు, ప్రేమికులు, కవులు) ఎలా ఈ చనిపోవడానికి కూడా సిద్దపడేంత ఉద్వేగాలకు సంవత్సరంలో ఒక మూగ రోజును మాత్రమే కేటాయిస్తారా (అధికారికంగా)? ఆలోచించండి... ప్యార్‌, మొహబ్బత్‌, ఇష్క్‌, చాహత్‌..... కేవలం ఒక మూర్ఖ, నాసిరకమైన రోజా... ఊహించండి?!

రెండో అంశం. ఎలా దివాలి, హోలీ, క్రిస్మస్‌, లేదా ఎన్నో పెద్ద సంఘటనలున్నాయి - ఇందులో వి-దినోత్సవానికి ఇంత అట్టహాసం ఉంటుంది? ఆకస్మాత్తుగా, రిప్‌-వాన్‌-వింకిల్‌ స్టైల్‌లో భారీ సంఖ్యలో కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది, ఎవరో సూచించినట్టుగా, శక్తినిచ్చినట్టు ఉన్మాదం పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా మన్మథుని పూజిస్తారు! ఎవరైతే ఈ ముషై, మూనీ పార్టీలో పాల్గొనరో, తగిన మత్తులో మునిగిన భాగస్వామి ఉండరో లేదా జాగూరుకతతో ఈ ఉచ్చు బయట ఉంటారో ఆ పేద దేవతలకు దేవుడు సాయపడతాడు! ఆగ్రహం, షాక్‌, దయ, కలతపరిచే, ఎక్కువ శబ్దంతో పరిహాసాలు లోపలికి వస్తాయి! స్వేచ్ఛా వ్యాఖ్యానాల (''బేచారా, విషాదంగా ఒంటరిగా ఉన్నాడు'' నుంచి ''ఎంత విచిత్రంగా ఉన్నాడు!'' నుంచి ''ఈ భారీ దినాన్ని నిర్వహించుకోడానికి ఎవరైనా చీప్‌స్కేట్‌ను పట్టు బాస్‌!'' నుంచి ''ఎంత స్పందన లేని చల్లగా ఎవరైనా ఉంటారా? మొత్తం ప్రపంచం ప్రేమ స్ఫూర్తిని వేడుక చేసుకుంటుండగా, ఈ వాకో ఇంట్లోనే ఉన్నాడు! ఇలాంటి వారిని నరకంలో పడేయాలి!'' ) మధ్య స్థితికి రండి. సంక్షిప్తంగా, మానవ ఒత్తిడిలో చేరడం లేదా మరొకటి బలీయమైన ప్రభావం చూపుతుంది.

అంశం మూడు. ఇది స్పష్టంగా, పూర్తిగా బ్యాంక్‌ -బాజా దినోత్సవం! అరుదుగా, ఒకవేళ ఎప్పటికి, ఇలా అత్యద్భుతంగా రూపొందించిన ప్యార్‌-తో-పైసా ఇంజిన్‌ ఉంటే! ఈ కదిలే రొమాన్స్‌ వేషం, ఎక్కువ మొత్తంలో వ్యాపారీకరణ, ఒక్క మాయా వీచికతో మీరు ఎంతో కష్టపడి దాచుకున్న మొత్తాన్ని ఊడ్చేస్తుంది. జోర్‌ క జట్కా, ధీరే సే లగే, బేటా! పూలు, చాక్లెట్లు, కార్డ్స్‌, వైన్‌, ఖరీదైన బహుమతులు, ఆశ్చర్యాన్ని కలిగించే విహారయాత్రలు.... ఏదైనా, ప్రతిదీ ఈ దుర్భల దినోత్సవం రోజు జరగవచ్చు... వజ్రాలు సైతం! అస్కార్‌ను సైతం గెలుచుకునే ప్రదర్శన ఏమిటంటే బహుమతులను పొందగానే భాగస్వాములు (గోష్‌, జాను, న, నేను దీన్ని తీసుకోలేను! నువ్వు తేకుండా ఉండాల్సింది! భగవంతుడా నువ్వేం చేశావో చూడు? నేను చనిపోతాను! నీకు తెలుసా నీతో ఉండడమే నేను ఎప్పటికీ కోరుకునేది తదితరాలు'')

జోర్‌ కా జట్కా, ధీరే సే లగే, బేటా! పూలు, చాక్లెట్లు, కార్డులు, మందు, ఖరీదైన బహుమతులు, ఇంకా ఓ ఆశ్చర్యకరమైన సెలవు... ఈ రోజున ఏమైనా జరిగేందుకు అవకాశముంది. ఇంకా వజ్రాలు కూడా. ఇంకా, ఆ బహుమతులను అందుకునే సమయంలో ఆస్కార్‌ను కూడా నెగ్గే స్థాయిలో ఇరువైపుల వారూ ప్రదర్శించే నటనకు అంతన్నదే ఉండదు! ('వద్దు, వద్దు. నేను అంగీకరించలేను. మీరూ అంగీకరించకుండాల్సింది. ఓ దేవుడా! నీవేం చేశావో చూడు! నేను చస్తాను!! నేను కోరుకున్నదల్లా కేవలం నీతో ఉండటమేనని నీకూ తెలుసు'.. వంటివి).

జీవితంలో ఎన్ని సంక్లిష్టతలో! ఇక మీ భాగస్వాముల మధ్య ఉన్న తీవ్రమైన ఒత్తిడిని దీనికి కలుపుకోండి. ఎవరి ప్రేమికుడు/పురుషుడు/స్నేహితుడు
/భర్త/మనిషి అత్యుత్తమమైన (ఖరీదైన అని చదువుకోండి) బహుమతి ఇచ్చాడన్నది పెద్ద చర్చనీయాంశం. పేరు గొప్ప నెమ్మదైన సెక్సు, సున్నితమైన, బాగోగులు చూసే, నెమ్మదైన, రొమాంటిక్‌, భావోద్వేగపరమైనవన్నీ హఠాత్తుగా స్వార్థంలోకి దిగుతాయి. నాకివ్వు-నాకివ్వు, అన్నీ లాక్కునే అవతారం ఈ రోజున చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గతేడాది వాలెంటైన్స్‌ డే గోల (భారత్‌ అనే ఓ సర్కస్‌లో) హీనపక్షం రూ.12,000 కోట్ల వ్యాపారానికి కారణమైందంటే అందులో ఆశ్చర్యమేముంది?

నాలుగో పాయింటు. ప్రేమ మతహౌతలో నేటి ప్రేమికుల దినోత్సవం పూర్తిగా వాణిజ్యాంశంగా మారింది. పీఆర్‌, ప్రకటనలు హోరెత్తించే మార్కెట్‌ నియంత్రిత ఈవెంటుగా మారిపోయింది. ఈ శాశ్వత భావోద్వేగానికి మెరుగైన రూపు కల్పించేందుకు పలు సహ కుట్రదారులు నిత్యమూ సిద్ధం. ఆతిథ్యం, రిటైల్‌ తాయిలాలు, ఇంకా కోట్లాది ఇతర అవకాశాలు. అన్నీ కత్తులకు పదును పెట్టుకుని, తమకేసి కోరి మరీ వచ్చే బలిపశువుల శిరసులను అమాంతంగా ఖండించేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటాయి! చీజీ, మషీ, గమ్మత్తైన గ్రీటింగ్‌ కార్డుల నుంచి పువ్వులు, చాక్లెట్లు, మందు, నగలు, ప్రత్యేక సెలవులు విందుల వంటివి, ఇంకా అతి ఖరీదైన బ్యూటీపార్లర్లు వంటివి వీటిలో అతి కొన్ని మాత్రమే. ప్రత్యేకమైన జంటకు ఈ లవ్‌ సునామీ సందర్భంగా మరపురాని స్మృతులను మిగిల్చేందుకు ఇవి పాటుపడుతూ ఉంటాయి.

ఐదవ పాయింటు. ఆలోచించండి. కాస్తయినా. మగాళ్ల పట్ల ఈ రోజు ఎంత అన్యాయంగా రూపుదిద్దుకుందో ఎప్పుడైనా ఆలోచించి చూశారా? ప్రేమ నిజానికి రెండు దారులకూ దారి తీసే టికెట్‌. కానీ ప్రతిసారీ మగాళ్లకే 'ఆశ్చర్యపరుచు-ఆనందింపజేయి' వంటి ఆదేశాలను అమలు చేయాల్సి వస్తుంది. వస్తువులు, బహుమతులు ఇవ్వాల్సి కూడా ఉంటుంది. అందమైన, ఊపిరి తీసేసే అందాల బొమ్మ చేయాల్సిందల్లా కేవలం అక్కడికి రావడం మాత్రమే. మంచి దుస్తుల్లో, మంచి మేకప్‌ (ఆస్కార్‌ను గెలిచే స్థాయిలో) వేసుకుంటే చాలు. మరి ఈ ఆడాళ్లు కూడా మార్పు కోసం ఏం చేస్తున్నారు? సమానత్వం, స్వేచ్ఛ, ముక్తి, విముక్తి, ఆత్మగౌరవం, స్వాతంత్ర్యాల కోసం వారు నిరంతరం విసుగూ విరామం లేకుండా చేసిన నినాదాలు ఏమయ్యాయి? మరి వీటిని జయించినదేమిటి? ప్రేమా, లేక వస్తువులా? అవకాశవాదం, సెక్సిజం. కాదా?

బాబులూ! చివరికి, నేను విసిగిపోయాను. ఒక్కొక్కరికి ఇది ఒక్కొక్క రకమైనదని నా ఉద్దేశం. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భారత్‌లో (భారతీయుల్లో) ఇది చాలా పెద్ద ఈవెంటు. వాలీవుడ్‌, క్రికెట్‌ వంటివి ఎలాగైతే జనాల ఆసక్తిని సొంతం చేసుకున్నాయో, అలాగే ఇది కూడా దేశవ్యాప్తంగా చొచ్చుకుపోయింది. దీని తాలూకు భావోద్వేగపూరిత చాంపియన్లకు ప్రకటించండి, ''బాధలు, ఏడ్పులు, క్రూరత్వం, అన్యాయాలతో నిండిన ఈ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క రోజును సిగ్గూ ఎగ్గూ లేకుండా, అడ్డూ అదుపూ లేకుండా ప్రేమను వ్యక్తీకరించుకునేందుకు అట్టిపెట్టుకుంటే తప్పేమిటి? నకిలీదే కావచ్చు, కనీసం ఒక్క క్షణంపాటైనా నన్నెవరైనా ప్రేమించండి''. హఠాత్తుగా నేను కూడా బలహీనపడ్డాను. (వివాదాస్పద?) ప్రాంతాల్లోకి కూడా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. అవి కేవల ప్రేమ, కరుణ, స్పర్శ, చిరునవ్వు, కౌగిలింత వంటివి ఏడాదిలో ఏదో ఒక రోజు పంపకాలు పెట్టే ఈ కంగాళి, ఖరీదైన బహుమతుల కంటే చాలా గొప్పవి. దయ, కరుణ, భావాలు, సహానుభూతి, సృజనాత్మకతలకు ఏ ఖర్చూ లేదు. కానీ ఈ డిజైనర్‌ ధమాకాల కంటే అవి కోటానుకోట్ల రెట్లు ఎక్కువవి. కానీ, దాన్ని కూడా పోనీ! (కాకపోతే, మిగతా 364 రోజుల్లో తనను దారుణంగా పరిగణించవద్దన్నది మాత్రం గుర్తుంచుకోండి. అంతే చాలు).

 
 

ఈ కథనానికి రేటింగ్ ఇవ్వండి:
చెడ్డది మంచిది    
ప్రస్తుత రేటింగ్ 0
Post CommentsPost Comments
సంచిక తేదీ: జూన్ 3, 2013

చిత్రాలు
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన
'సాక్షి 'ఖాతాల నిలుపుదలపై నిరసన